జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలపై కలెక్టరేట్లో మీడియా ప్రతినిధులతో ఏర్పా టుచేసిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఉన్న మూడు డివిజన్లలోని 23 మండలాల జెడ్పీటీసీలు, 235 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు చెప్పారు. 486 గ్రామపంచాయతీలు, 4388 వార్డు సభ్యులకు ఎన్నికలు ఉంటాయని తెలిపారు.