ధర్మవరం పట్టణం మాధవ నగర్ కు చెందిన బత్తుల హేమంత్(22) అనే యువకుడు వినాయక నిమజ్జనం సందర్భంగా సంగమేశ్వరం వద్ద నీటి కుంట లోతును పరిశీలించడం కోసం కిందికి దిగి ఊపిరాడక మరణించాడు. శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. హేమంత్ మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. హేమంత్ మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.