కరీంనగర్ నగరంలోని మినీ గణేష్ నగర్ బైపాస్ రోడ్డు వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగినట్టు జరిగినట్లు స్థానికులు శుక్రవారం ఉదయం తెలిపారు. గణేష్ నగర్ కు చెందిన దిలీప్ మరో వ్యక్తి ద్విచక్ర వాహనాలపై వస్తుండగా ఎదురెదురుగా ఢీకొన్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు 108 వాహనం ద్వారా ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఇద్దరు క్షతగాత్రులు.