అక్రమంగా తరలిస్తున్న నాలుగు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు కేసముద్రం పోలీసులు, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య,ఈరోజు సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు, నమ్మదగిన సమాచారం మేరకు, కేసముద్రం మండలం, ఉప్పరపల్లి క్రాస్ రోడ్ వద్ద ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో, వారిని ఆపి తనికి చేయగా, వారి వద్ద గంజాయి పట్టుబడిందని పేర్కొన్నారు, ముగ్గురు వ్యక్తులు ఒడిస్సా నుండి నాలుగు కిలోల గంజాయి కొనుగోలు చేసి ట్రైన్ లో మహబూబాబాద్ వచ్చి అక్కడ నుండి కేసముద్రం వచ్చి వాహనం కోసం ఎదురు చూస్తుండగా పోలీసులు పట్టుకున్నట్లు పేర్కొన్నారు.