నూతనకల్ నుంచి వెంకేపల్లి వరకు బీటీ రోడ్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. వర్షాల కారణంగా సుమారు 6 కిలోమీటర్ల మేర రోడ్డు పూర్తిగా దెబ్బతిని గుంతలమయంగా మారిందని, దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్య దర్శివర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి అన్నారు. దీనిపై ఎమ్మెల్యే, అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఆమె కోరారు.