Araku Valley, Alluri Sitharama Raju | Aug 31, 2025
అరకులోయ పరిధిలో ఉన్న కాఫీ తోటలకు కొత్తగా వస్తున్న కాయ తొలిచుపురుగు అనే తెగులకు సంబంధించి రైతులకు విస్తృతంగా కాఫీ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ తెగులు వల్ల గింజలు నల్లగా మరి రైతులకు తీవ్రమైన నష్టం కలుగుతుందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. దీనికి చేపట్టాల్సిన నివారణ చర్యలను కాఫీ అధికారులు నేరుగా కాఫీ తోటలకు వెళ్లి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు కాఫీ తోటలకు కాయ తొలిచూపు ఆశించిన లక్షణాలు కనిపిస్తే వెంటనే కాఫీ విస్తరణ విభాగం శాస్త్రవేత్తలను సంప్రదించాలని లైజన్ అధికారులు కోరుతున్నారు.