తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాలో గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వందేళ్ళలో ఎప్పుడు రానంత భారీ వర్షం కురిసే వరదలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజలను కచ్చితంగా ఆదుకుంటుందన్నారు. రోడ్డు బ్రిడ్జిలు వంటి మరమ్మతులు అధికారులు చేపట్టారన్నారు. ప్రత్యక్షంగా మీ కష్టాలను జరిగిన నష్టాలను చూడడానికే ఇక్కడికి వచ్చామని సీఎం తెలిపారు శాశ్వత పరిష్కారం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పంట నష్టం వాటిల్లిన రైతులు ఆందోళన చెందకుండా పంట నష్టపరిహారం అందిస్తామని పేర్కొన్నారు.