గోనెగండ్ల: రోడ్డు ప్రమాదంలో సర్పంచ్ మృతి..గోనెగండ్ల మండలం గంజహళ్లి సర్పంచ్ తోలు లింగమ్మ(72) మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. లింగమ్మ గత సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ మద్దతుతో గెలుపొందారు. గురువారం బంధువుల పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో బైక్ నుంచి కిందపడి తలకు తీవ్రగాయమై మృతి చెందారు. ఆమె మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.