బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం లోని ఆళ్ళవారిపాలెం గ్రామంలో గోల్లపూడి. వెంకటేశ్వర్లు గడ్డివామును ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారని గొల్లపూడి వెంకటేశ్వరరావు ఆరోపించాడు. వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ కనకదుర్గమ్మ గుడి వద్ద వారి మనుమరాలు అన్నప్రాసన కార్యక్రమానికి వెళ్లారు. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో వరిగడ్డి వాము పూర్తిగా దగ్ధమైందని, వారిపై ఫిర్యాదు చేస్తానని వెంకటేశ్వర వెల్లడించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో చుట్టుపక్కల గృహాల వారు ఊపిరి పీల్చుకున్నారు.