యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి పట్టణంలోని చెరువు వద్ద వినాయక నిమజ్జనాల వేల శుక్రవారం రాత్రి అపశృతి చోటుచేసుకుంది. క్రేన్ నుండి నిమజ్జనానికి గణనాథుడిని దింపే సమయంలో జారిపడి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అధికారుల సమన్వయ లోపం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.