గంగవరం: మండలం వ్యవసాయ కార్యాలయం నందు రైతులు తెలిపిన సమాచారం మేరకు. ఉదయం 4గంటల నుండే యూరియా కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. రైతులు గొడవ పడడంతో గంగవరం పోలీసుల సహాయం కోరిన వ్యవసాయ శాఖ అధికారులు. వ్యవసాయ సంబంధిత అధికారులు 350 టోకన్సు రైతులకు ఇచ్చారు. కానీ రైతులు వందలాది మందిగా రావడంతో పోలీసులు కంట్రోల్ చేసి రైతులను వెనక్కి పంపించారు. గంగవరం మండల వ్యవసాయ అధికారి రతిబా మాట్లాడుతూ, సింగల్ విండో సొసైటీలో రైతులకు యూరియా ఇస్తున్నాము. రైతులు ఎవరూ బాధపడొద్దండి రైతు సేవా కేంద్రాల్లో యూరియాతోపాటు కాంప్లెక్స్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు.