కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాక్సిడెంట్ &ఎక్స్ప్రెస్ హెల్త్ ఇన్సూరెన్స్ బీమాను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కావలి హెడ్ పోస్ట్ మాస్టర్ కోరారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ బీమాలో భాగంగా ఏడాదికి రూ.755 కడితే యాక్సిడెంట్లో చనిపోతే రూ.15 లక్షలు, ఏడాదికి రూ. 555 చెల్లిస్తే రూ. 10 లక్షల బీమా వస్తుందన్నారు. మరిన్ని వివరాలకోసం పోస్ట్ ఆఫీస్లో సంప్రదించాలని ఆయన మంగళవారం ఉదయం 10 గంటల 30 నిమిషాల ప్రాంతంలో తెలిపారు.