చెన్నూర్ పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకు లో గత నెల 23న అపహరణకు గురైన 20 కిలోల బంగారు ఆభరణాలను పోలీసులు పూర్తిస్థాయిలో రికవరీ చేశారు. గత నెల 31న 15 కిలోల 237 గ్రాముల బంగారు ఆభరణాలు రికవరీ చేసినట్లు రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝూ వెల్లడించిన విషయం తెలిసిందే, మరో 5 కిలోల 250 గ్రాముల బంగారు ఆభరణాలను వివిధ ప్రైవేటు సంస్థల నుండి పోలీసులు రికవరీ చేశారు. ఈ మేరకు గురువారం సాయంత్రం మంచిర్యాల డిసిపి భాస్కర్ మాట్లాడుతూ బ్యాంకు నుండి దొంగలించబడిన మొత్తం బంగారు ఆభరణాలు రికవరీ చేసినట్లు తెలిపారు. రికవరీ చేసిన బంగారు ఆభరణాలను కోర్టులో డిపాజిట్ చేస్తామని పేర్కొన్నారు.