ధూల్పేట్లో గంజాయి అమ్ముతున్నారనే సమాచారం మేరకు ఎన్టీఎఫ్ఎ టీమ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో రేఖ బాయ్ అనే మహిళను అరెస్ట్ చేసి, 1.532 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. పరారీలో ఉన్న జానకి బాయ్ అనే మరో మహిళ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని, అదుపులోకి తీసుకున్న మహిళను ధూల్పేట్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించామన్నారు.