మడకశిర పట్టణంలో సెప్టెంబర్ 2న నిర్వహించే దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమానికి అభిమానులు వైకాపా కార్యకర్తలు తరలిరావాలని మడకశిర వైసిపి ఇన్చార్జ్ ఈర లక్కప్ప అన్నారు. ఆదివారం మడకశిరలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరు చెబితే ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ పెన్షన్లు ఇందిరమ్మ ఇల్లు గుర్తుకు వస్తాయని ఆంధ్రప్రదేశ్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ని ఎవరు మర్చిపోలేరని అన్నారు. అనంతరం ఓ ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణకు ఆయన హాజరయ్యారు.