కరీంనగర్ రూరల్ మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బిజెపి రూరల్ మండల శాఖ అధ్యక్షుడు సంతోష్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం రూరల్ ఎమ్మార్వో ఆఫీస్ ముందు నిరసన తెలిపారు. రూరల్ మండలంలోని ముగ్ధంపూర్ అగ్రికల్చర్ కళాశాల నిర్మాణం వెంటనే చేపట్టాలని,చామనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లో 30 పడకల గదులు నిర్మాణం చేపట్టాలని, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేయడం లేదని ఆరోపించారు.ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు.