రైతులు ఎరువులను విచక్షణా రహితంగా వాడకుండా దిగుబడి పెంచుకునేందుకు కృషి చేయాలని సాలూరు వ్యవసాయ సహాయ సంచాలకులు సత్యవతి కోరారు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలోని పి.కోనవలస లో మంగళవారం మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని ఏఓ కొల్లి తిరుపతిరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యవతి రైతులతో మాట్లాడుతూ వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు తీసుకుని సాగు ఖర్చు తగ్గించుకోవాలన్నారు. ప్రస్తుతం సాగు అవసరాలకు సరిపడా యూరియా మాత్రమే తీసుకుని వెళ్లాలని, మళ్లీ ఎరువురు వస్తాయని ఆందోళన చెందవద్దని తెలిపారు.