పల్నాడు జిల్లా, పెడకూరపాడు నియోజకవర్గం, బెల్లంకొండలో రంజాన్ మాసం సందర్భంగా నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మంగళవారం రాత్రి పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ మాసాన్ని ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని కోరారు. అల్లా దయతో అందరూ బాగుండాలని ఆకాంక్షించారు..