శనివారం సాయంత్రం ఐదు గంటలకు బల్ది ఆ ప్రధాన కార్యాలయ కౌన్సిలర్లు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేయర్ కమిషనర్ చాహత్ వాజ్పేయిలు పాల్గొని మట్టి వినాయక విగ్రహాలను మెప్మా ఆర్పీలు ఎన్ హెచ్ జి లు బల్దియా సిబ్బందికి పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మేయర్ సుధారాణి మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా బల్ది ఆధ్వర్యంలో కాలుష్య నియంత్రణ మండలి ద్వారా కేటాయించే మట్టి వినాయకులను మెప్మా బల్దియా సిబ్బందికి పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ సంవత్సరం సుమారు 50 వేల విగ్రహాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.