మట్టి వినాయకులను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడదామని వరంగల్ పశ్చిమ శాసనసభలో నాయిని రాజేందర్రెడ్డి పిలుపునిచ్చారు. హనుమకొండ లోని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నియోజకవర్గ వ్యాప్తంగా 30 వేల మట్టి వినాయకులను పంపిణీ చేస్తున్నామని, ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని మున్సిపాలిటీ పరిధిలో ఇంటి నిర్మాణ అనుమతికి ఆరు మొక్కలు పెంచితేనే అనుమతులు ఇచ్చే విధంగా మేయర్ తో కలిసి విధి విధాన రూపొందిస్తున్నామని అన్నారు