ఎమ్మిగనూరు లోని మైనారిటీ కాలనీ అభివృద్ధిపై యువకుడి ఆవేదన, నిరసన దీక్షకు సిద్ధం..1999లో బీవీ మోహన్ రెడ్డి ముస్లిం మైనారిటీలకు ప్రభుత్వ పట్టాలు ఇచ్చి 25 ఏళ్లు గడిచినా ఎమ్మిగనూరులోని మైనారిటీ కాలనీ అభివృద్ధి చెందలేదని, రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా లేకపోవడం దారుణమని మైనారిటీ కాలనీ యువకుడు ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే నిరసన దీక్ష చేపడతామని ఆయన తెలిపారు.