రేవంత్ రెడ్డి దొంగ హామీలతో అధికారంలోకి వచ్చాడని,రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.ఆదివారం పాలకుర్తి మండలం దర్ధపల్లి గ్రామంలో పలు గ్రామాలకు చెందిన రెండు వందల మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థ ఎన్నికలలో అన్ని గ్రామాలలో బిఆర్ఎస్ పార్టీదే గెలుపు ఖాయం అన్నారు.కేసీఆర్ హయాంలో పాలకుర్తి నియోజకవర్గన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని అన్నారు.