స్కూల్లో మట్టి విగ్రహాల తయారీ చేశారు విద్యార్థులు.. జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కథలాపూర్ మండలం భూషణరావుపేట గ్రామంలోని ఎంపీపీఎస్ విద్యార్థులు పర్యావరణాన్ని రక్షించాలంటూ మట్టి గణపతి విగ్రహాలను మంగళవారం తయారు చేశారు.ఉపాధ్యాయులు చిన్నారులకు వీటిపై అవగాహన కల్పించి, వారితో ఇలా చేయించడం అభినందనీయమని పర్యావరణ ప్రేమికులు ప్రశంసించారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన గణేశ్ విగ్రహాలను వాడొద్దన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని (బాలికల) జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు పర్యావరణ పరిరక్షణలో బాగంగా వినాయకులు తయారు చేసి పంపిణీ చేశారు విద్యార్థులు.