ఎన్నికల కమిషన్ సహకారంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓట్ల దొంగతనానికి పాల్పడుతోందని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆరోపించారు. దీనికి నిరసనగా బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు బయలుదేరిన మహిళా కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు గాంధీ భవన్ వద్ద అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్తత నెలకొంది. కార్యకర్తలు 'ఓట్ చోర్.. గద్దీ చోడ్' అంటూ నినాదాలు చేశారు.