యూరియా కోసం రైతులు ఎవ్వరూ కూడా ఆందోళన చెందవద్దని మిడుతూరు మండలం వ్యవసాయ అధికారి ఎం.పీరు నాయక్ అన్నారు,నంద్యాల జిల్లా మిడుతూరు మండలానికి శుక్రవారం మండలంలోని ఆయా గ్రామాలు చింతలపల్లె, చౌటుకూరు,చెరుకుచెర్ల, కడుమూరు గ్రామాలకు 54 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని ఏవో తెలిపారు. అదేవిదంగా వచ్చిన యూరియాను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంఏఓ,తహశీల్దార్ శ్రీనివాసులు,ఏఎస్ఐ హరిప్రసాద్ మరియు వ్యవసాయ అధికారుల సమక్షంలో రైతులకు యూరియాను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. మరో రెండు రోజుల్లో మండలానికి 100 మెట్రిక్ టన్నుల యూరియా వస్తుంది అంతేకాకుండా వచ్చే నెలలో ఖరీఫ్ సీజన్ ను బట్టి రైతులకు యూరియా అవసరం ఉం