భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌక 'ఐఎన్ఎస్ త్రిఖండ్' ఈజిప్టు ఆధ్వ ర్యంలో జరగనున్న బహుళపక్ష విన్యాసాల కోసం అలె క్సాండ్రియా పోర్టుకు చేరుకుందని నేవీవర్గాలు తెలిపాయి. ఈనెల ఒకటో తేదీ నుంచి పదో తేదీ వరకు భూతలం, నింగి, సముద్ర జలాల్లో విన్యాసాలు జరగనున్నట్టు పేర్కొన్నాయి. ప్రాంతీయ సముద్ర ప్రాంత భద్రత సహ కారాన్ని శక్తిమంతం చేసేందుకు యూఎస్ఏ, ఈజిప్టు, భారత్, సౌదీ అరేబియా, ఖతార్, గ్రీస్, సైప్రస్, ఇటలీ భాగస్వామ్యం కానున్నాయని వెల్లడించాయి. బ్రైట్ స్టార్-2025 పేరిట ఈ విన్యాసాలు కొనసాగుతాయన్నారు.