ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం లో బుధవారం ఉదయం 8 గంటల మధ్యాహ్నం మూడు గంటల వరకు వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు నూజివీడు నియోజకవర్గం లో పట్టణ గ్రామ ప్రాంతాలలో వినాయక మండపాలు ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు నూజివీడు మండలం, ఆగిరిపల్లి మండలం, ముసునూరు మండలం, చాట్రాయి మండలంలో ప్రధాన సెంటర్ల వద్ద ఏర్పాటుచేసిన మండపాల వద్ద వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భక్తులు వినాయక చవితి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజలందరిని కష్టాల నుండి గట్టెంకించాలని ప్రతి ఒక్క మానవ జీవితాలలో ఆనందం వెలుగు నింపాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు