శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లోని లేపాక్షి మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండూరు గ్రామంలో లేపాక్షి పోలీసులు సీఐ జనార్ధన్ రాత్రి బస కార్యక్రమంలో పాల్గొని రాత్రి బస నిర్వహించారు. పోలీసులు సందర్శన సమయంలో ప్రజలతో మాట్లాడి వారి ఫిర్యాదులను స్వీకరించారు మరియు ఈ ప్రాంతంలోని శాంతిభద్రతల సమస్యలపై గ్రామ సభ నిర్వహించి చర్చించారు. ఆస్తి నేరాలు, రోడ్డు ప్రమాదాలు, మహిళల భద్రత, మహిళలపై నేరాలు, ఆత్మహత్య ధోరణులు మరియు పిల్లల రక్షణ గురించి కూడా అవగాహన కల్పించారు. అదనంగా, మెరుగైన భద్రత కోసం CCTV కెమెరాలను ఏర్పాటు చేయమని గ్రామస్తులను సిఐ కోరారు.