సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ వద్ద పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ ను ప్రభుత్వం విడుదల చేయాలని SFI ఆధ్వర్యంలో ఫీజు దీక్ష చేపట్టారు. SFI జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ 8158 వేలకోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయని అన్నారు.వాటిని విడుదల చేయకపోవడం వల్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఉన్నత చదువుల కోసం వెళ్లాలంటే ప్రైవేట్ యాజమాన్యాలు సర్టిఫికెట్స్ ఇవ్వకపోవడంతో విద్యార్థులు డబ్బులు కట్టలేక మధ్యలోనే చదువులు ఆపేసే పరిస్థి