ఓ దొంగను పట్టుకొని దేహశుద్ధి చేసి కట్టేసిన సంఘటన కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీ రోడ్ వద్ద ఆదివారం రాత్రి 9గంటలకు జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గాంధీ చౌరస్తా వద్ద గల HDFC బ్యాంక్ పక్క ఉన్న ఉగాది తాళం పగలగొట్టేందుకు ఎక్కించిన దొంగను స్థానికులు పట్టుకున్నారు. సదరు దొంగను విచారించిన స్థానికులు మద్యం మత్తులో పొంతన లేని సమాధానం చెప్పడంతో స్థానికులు 3 టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తాళం పగలగొట్టిన స్థలాన్ని పరిశీలించి.. అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.