ప్రజాకవి కాళోజీ నారాయణ రావు జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా BC సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన జయంతి వేడుకల్లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతి రెడ్డి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం, కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కాళోజీ నారాయణ రావు అందించిన సేవలను వక్తలు కొనియాడారు. అంతకుముందు వర్ని చౌరస్తాలో గల కాళోజీ విగ్రహానికి కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.