ఎమ్మిగనూరు: తన సొంత డబ్బులతో 100 ట్రాక్టర్ల గ్రావెల్తో రోడ్డు గోనెగండ్ల మండలం వేముగోడులో ఏడేళ్ల నుంచి పెద్దనేలటూరుకు వెళ్లే రహదారి సరిగ్గా లేక, ఆ ప్రాంతంలో ముళ్ల కంపలు, డ్రైనేజీ నీరు నిలబడి, పాఠశాలకు వచ్చే విద్యార్థులు పంట పొలాలకు వెళ్లే రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. ఈ సమస్యను గ్రామానికి చెందిన పోలీస్ మహబూబ్ బాషా గుర్తించి, తన సొంత డబ్బులతో సుమారు 100 ట్రాక్టర్ల గ్రావెల్ రోడ్డు వేయించి దాతృత్వాన్ని చాటుకున్నాడు.