వినాయక నిమజ్జనానికి పాకల బీచ్‌లో చేసిన భద్రతా ఏర్పాట్లను బుధవారం సాయంత్రం ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు పరిశీలించారు.నిమజ్జన కార్యక్రమం సజావుగా, శాంతియుత వాతావరణంలో పూర్తయ్యేలా చూడడానికి చేయాల్సిన భద్రతా ఏర్పాట్లు,ట్రాఫిక్ నియంత్రణ చర్యలు,రక్షణ బృందాల కదలికలపై ఆయన సమీక్ష నిర్వహించారు.అలాగే గ్రామస్తులతో కూడా ఆయన మాట్లాడి పలు సూచనలు చేశారు.ప్రజలు పోలీసులకు సహకరించాలని డీఎస్పీ కోరారు.