భీమ్ గల్ పట్టణంలో వినాయక నిమజ్జనం జరిగే రావుల చెరువును మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, తహసిల్దార్ మహమ్మద్ షబ్బీర్ మంగళవారం పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. నిమజ్జనం జరిగే ప్రాంతంలో లైటింగ్ ఏర్పాటు మరియు భారీ గేట్స్ ఏర్పాటు. కట్ట పైన బ్లేడ్ ట్రాక్టర్ తో లెవలింగ్ చేయడం. మొరం పోయడం మరియు. వినాయక నిమర్జనం జరిగే రూట్ మ్యాప్ ని పరిశీలించారు. నిమజ్జనం జరిగే రూట్ మ్యాప్ లో ఎక్కడ కూడా రోడ్డుపైన మట్టి గాని ఇసుక గాని ఉండకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, మొరం పొయ్యాలని సిబ్బందిని ఆదేశించారు.