ఆదోని విజయనగర్ కాలనీలో 18 రోజుల క్రితం గుండెపోటుతో మృతిచెందిన పింజారి మహమ్మద్ అలీ కుటుంబానికి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి గుడిసె ఆది కృష్ణమ్మ రూ.20,000 ఆర్థిక సాయం అందించారు. ఐదుగురు చిన్న ఆడపిల్లలతో కష్టాల్లో ఉన్న కుటుంబానికి భవిష్యత్తులో తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రజలు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.