పలమనేరు:శాసన సభ్యులు అమరనాథ రెడ్డిని స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్లుగా నియమితులైన వి.కోటకు చెందిన రంగనాధ్, గజేంద్రలు గురువారం కలసి సన్మానించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ గా వీ.కోట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎ. ఎం. రంగనాధ్ ను, అదే మండలానికి చెందిన గజేంద్రను ఏపీ స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ నియమితులైన విషయం తెలిసిందే. పార్టీ కోసం పనిచేసిన తమ సేవలను గుర్తించి రాష్ట్ర స్థాయి పదవులకు ఎంపిక చేసిన స్థానిక శాసన సభ్యులను ఈ సందర్బంగా పలమనేరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కలసి ఆయన్ను సన్మానించి ధన్యవాదాలు తెలియజేశారు.