స్త్రీ శక్తి పథకం ద్వారా ఆటో కార్మికులు వారి జీవనోపాధిని కోల్పోతున్నారని, ఉచిత బస్సు పథకం వల్ల నష్టపోతున్న ఆటో డ్రైవర్లను ప్రభుత్వం అదుకో వాలని సిఐటియు ఆధ్వర్యంలో శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం తహసీల్దార్ కార్యలయం ముందు సిఐటియు ఆ ద్వర్యంలో ఆటో కార్మికులు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించి, రెవిన్యూ అధికారికి వినతిని అందించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు జెద్ పి శ్రీనివాసులు, పట్టణ కన్వీనర్ రాములు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలు కల్పించిన ఫ్రీ బస్సు సౌకర్యం వల్ల ఆటో డ్రైవర్లు అద్దెలు లేక తీవ్రంగా నష్టపోతున్నారని ఆటో డ్రైవర్లను ప్రభుత్వం అదుకోవాలని కోరారు.