పలమనేరు: తెలుగుదేశం పార్టీ కార్యాలయ వర్గాలు తెలిపిన సమాచారం మేరకు. మార్కెట్ కమిటీ (AMC) ఛైర్మన్ గా గంగవరం మండలానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు ఆలకుప్పం రాజన్న నియమితలయ్యారన్నారు. రాష్ట్రంలోనే పలమనేరు టమాటా మార్కెట్ కు పేరుంది. ఇక్కడి నుంచి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు నిత్యం టమాటా ఎగుమతి జరుగుతుంది. ఈ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవికి తీవ్ర పోటీ ఉంటుంది. రాజన్నను ఈ పదవి లభించడంతో ఆయన వర్గీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.