వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సమిష్టి కృషిగా పని చేయాలని వికారాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనందు తెలిపారు. శుక్రవారం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వికారాబాద్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు సభ్యుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో ప్రతి గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయాలని దిశా నిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరూ ప్రణాళిక బద్ధంగా సమన్వయంతో పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని తెలిపారు.