ప్రతాపసింగారంలో ప్రత్యక్షమైన కొండచిలువ HYD ప్రతాపసింగారంలో రోడ్డుపై భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. నత్తనడకన పాకుతున్న పామును చూసి వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. పైథాన్ను ఫోన్లలో వీడియోలు తీశారు. ఆ తర్వాత పాము చర్చి వద్ద చెట్ల పొదల్లోకి వెళ్లింది. ఇదే ప్రాంతంలో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్నేక్ సోసైటీ వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.