జాతీయ రహ దారి పంజాబు హోటల్ వద్ద ఒక ట్రావెల్ బస్సు అదుపు తప్పి డివైడర్ పైకి దూసుకెళ్లి పక్కనే సేవా రహదారిలో వాహనదారుడిని ఢీకొ ట్టింది. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం మర్రి పాలెం ప్రాంతానికి చెందిన మహబూబ్ సుబాని(64) పంజాబు హోటల్ సేవా రహదారి గుండా మురళీనగర్ వైపు వెళ్తుండగా అదే సమయంలో విజయవాడ నుంచి కాంప్లెక్స్క్కు వెళ్తున్న ఒక ట్రావెల్ బస్సు అదుపు తప్పి డివైడర్ పైకి దూసుకెళ్లి అతన్ని ఢీకొట్టింది. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు.