నగరంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో నిజామాబాద్ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.సీనియర్ జర్నలిస్ట్ డా.బొబ్బిలి నర్సయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు వక్తలు పాల్గొని మాట్లాడారు.ముందుగా ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ బొబ్బిలి నరసయ్య మాట్లాడుతూ.... 1931లో నిజాం పాలనలో నిజామాబాద్ మున్సిపాలిటీగా, 1987లో స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా, 2005లో మున్సిపల్ కార్పొరేషన్ గా రూపాంతరం చెందిందని గుర్తు చేశారు.నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పడినా, ఇప్పటి వరకు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని ఆరోపించారు.