ప్రజా సంరక్షణకు పాటుపడుతున్న వేంపల్లి గ్రామపంచాయతీ కార్మికులు 15 నెలల పిఎఫ్ 5,6 నెలల వేతనాలు ఇవ్వలేదని గత ఐదు రోజులుగా విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్న పరిష్కరించాల్సిన పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ నాగ సుబ్బారెడ్డి డిప్యూటీ జనరల్ సెక్రెటరీ కెసి బాదుల్లా ఆరోపించారు. సోమవారం కడప కలెక్టర్ కార్యాలయం వద్ద ఏఐటియుసి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.