ధర్మవరం మండలం కునుతూరు గ్రామంలో శనివారం రూరల్ పోలీసులు గ్రామస్తులకు నేరాలు వాటిని ఎలా అడ్డుకోవాలి అన్న అంశాల గురించి అవగాహన కల్పించారు. రూరల్ సీఐ ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ మహిళల పట్ల గౌరవంగా మెలగాలని చిన్నపిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. గొడవలు లేకుండా అందరూ ప్రశాంతంగా జీవించాలన్నారు.