Kavali, Sri Potti Sriramulu Nellore | Aug 22, 2025
దగదర్తిలో శుక్రవారం టీడీపీ శ్రేణులు వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టాయి. కావలి మాజీ mla రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హత్యా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఆయన దిష్టిబొమ్మకు శవ యాత్ర నిర్వహించారు. కెనరా బ్యాంక్ సెంటర్ నుంచి ఎల్లిపాడు రోడ్డు వరకు నిరసన ర్యాలీ జరిపి దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రతాప్ కుమార్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని tdp నాయకులు పమిడి రవికుమార్ చౌదరి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం శుక్రవారం ఉదయం 10 గంటల 30 నిమిషాల ప్రాంతంలో జరిగింది.