యాదమరి మండలంలోని దసరా పల్లి గ్రామంలో మాతమ్మ జాతరలో భాగంగా నాలుగవ రోజు శుక్రవారం మధ్యాహ్నం ఘనంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. అనంతరం సాయంత్రం పరిసరాముడు తపస్సును కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం తపస్మాను ఒకో మెట్టు ఎక్కుతూ ఒక్కోపద్యం పాడుతూ తపస్సు మాను చేరుకుని నిమ్మకాయలు అరటి పండ్లు విసిరి వేసే సమయంలో బిడ్డలు పుట్టని వారికి బిడ్డలు పుడతారని నమ్మకంతో భక్తులు ఎగబడి నిమ్మకాయలు అరటి పండ్లు ప్రసాదంగా తీసుకోవడం జరుగుతుంది. అనంతరం వనము నోటితో కొరకడం ప్రత్యేకంగా ఈ గ్రామంలో నిర్వహించడం విశేషం