రోమ్ తగలబడుతుంటే ఫిడేలు వాయించినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి పనితీరు ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు గురువారం మీడియా సమావేశంలో విమర్శించారు. ఒకవైపు ప్రజల ప్రాణాలు పోతుంటే, రేవంత్ రెడ్డి ఏమో మూసీ సుందరీకరణ, ఒలింపిక్స్ ఆటల పోటీల మీద రివ్యూలు చేస్తున్నాడని మండిపడ్డారు. నిన్న ఒక మంత్రి హెలికాప్టర్ను అత్యవసర పరిస్థితుల్లోనే వాడాలని అంటున్నారు.. వాళ్లేమో పెళ్లికి, బీహార్ రాజకీయాలకు వాడతారని దుయ్య బట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.