సమాజంలోని సమస్యలను జర్నలిస్టులు విభిన్న దృష్టితో చూసి వాటిని పరిష్కరించేలా ప్రత్యేక కృషి చేస్తారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మహాసభలను అనంతపురం నగరంలోని జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల పాత్ర సమాజంలో అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు.