చీరాల మండలం వాడరేవు వద్ద సముద్రంలో ఆదివారం భారీ స్థాయిలో వినాయక నిమజ్జనాలు జరిగాయి.ఉదయం 11 గంటల సమయంలో మొదలైన నిమజ్జనాలు రాత్రి 8 గంటల వరకు కూడా కొనసాగుతూనే ఉన్నాయి.చీరాల పరిసర ప్రాంతాల నుండి ట్రాక్టర్లలో గణనాథుడిని ఊరేగింపుగా భక్తులు తీసుకువచ్చారు.నిమజ్జనాల సందర్భంగా పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు.సముద్ర తీరంలో రద్దీ ఏర్పడకుండా ప్రణాళికాబద్ధంగా నిమజ్జన వాహనాలను పోలీసులు పంపుతున్నారు.అలాగే భక్తులకు జాగ్రత్తలు చెబుతున్నారు.మెడికల్ క్యాంపు ను కూడా ఏర్పాటు చేశారు.