నల్లమోతువారి పాలెం హానీ టీ స్టాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనాన్ని శనివారం ట్రక్ ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనాన్ని నడిపే కాకుమాను గ్రామానికి చెందిన వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ట్రక్కు ఆటో డీ కొట్టడంతోనే క్షతగాత్రుడికి రెండు కాళ్లకు తీవ్రగాయాలు అయినట్లుగా స్థానికులు తెలుపుతున్నారు.